Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భారతీయుడు 2' సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్?

  • 'భారతీయుడు 2' సీక్వెల్ కి సన్నాహాలు
  • రంగంలోకి లైకా ప్రొడక్షన్స్ 
  • అనిరుధ్ కి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో శంకర్  
కమలహాసన్ .. మనీషా కొయిరాలా .. ఊర్మిళ .. సుకన్య ప్రధానమైన పాత్రలను పోషించిన 'భారతీయుడు' సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. శంకర్ కెరియర్లోనే ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం లభించింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టును తాను నిర్మించాలని దిల్ రాజు భావించారు .. అయితే సన్నిహితులు వారించడంతో, తాను తప్పుకుంటున్నట్టుగా తాజాగా ప్రకటించారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు వచ్చినట్టుగా సమాచారం.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఎంపిక చేసే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది. తమిళంలో ఇప్పుడు అగ్ర సంగీత దర్శకుడిగా అనిరుధ్ కొనసాగుతున్నాడు. అందువలన ఆయనకి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో శంకర్ వున్నాడని అంటున్నారు. గతంలో వచ్చిన 'భారతీయుడు' మ్యూజికల్ హిట్ గా నిలిచింది. రెహ్మాన్ క్రేజ్ ను ఈ సినిమా ఒక రేంజ్ కి తీసుకెళ్లింది. అనిరుధ్ ఎంపిక ఖరారైతే .. ఆయనకి ఇదొక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి.      
anirudh
shankar

More Telugu News